Kota: తెలుగు ప్రేక్షక హృదయాల్లో ‘కోట’ స్థానం పదిలం! సీఎం రేవంత్, KCR సంతాపం

విలక్షన నటుడు కోట శ్రీనివాస్ రావు (Kota Srinivasa Rao) మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట మృతి తీవ్రంగా కలిచివేసిందని తెలంగాణ సీఎం రేవంత్, కేసీఆర్, కేటీఆర్ ట్వీట్ చేసారు. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం 4 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన కోట మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ప్రతిపక్ష నేత కేసీఆర్ తదితరులు కోట శ్రీనివాస్ రావు మృతిపై సంతాపం తెలిపారు.