కోన వెంకట్ యూ టర్న్ తీసుకున్నాడా?
స్టార్ రైటర్ గతంలో పవర్ స్టార్ గురించి టైమ్ దొరికినప్పుడల్లా ఆయన తన సోల్ మేట్ అంటూ తెగ గొప్పలు చెప్పేవాడు. పవన్ తనకు ఆప్త మిత్రుడని చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ లో ఆయనకు మంచి ఆదరణ దక్కింది. కానీ 2019 ఎలక్షన్స్ టైమ్ లో పవన్ ఫ్యాన్స్ కు షాకిస్తూ వైసీపీలో జాయినవడమే కాకుండా పవన్ మీద తీవ్ర విమర్శలు కూడా చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ కోన వెంకట్ ను ఏకిపారేయడం మొదలుపెట్టారు.
మొన్న ఎలక్షన్స్ ముందు కూడా వైసీపీ గవర్నమెంట్‌కు ఎలివేషన్ ట్వీట్స్ వేస్తే పవన్ ఫ్యాన్స్ తో పాటూ మామూలు జనాలు కూడా కోనను ఆడుకున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక కోన మళ్లీ యూ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నాడు. పవన్ గురించి పాజిటివ్ గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. పవన్ గెలిచినప్పుడు మొక్కుబడిగా ట్వీట్ వేయడం కాకుండా వరుసగా ఆయనకు ఎలివేషన్స్ ఇస్తున్నాడు కోన.
పవన్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన రోజని, దీని కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ట్వీట్ చేశాడు కోన. ఇప్పుడు తాజాగా చేతి వృత్తులకు పవన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే కోన వైసీపీకి బైబై చెప్పి మళ్లీ పవన్ భక్తుడిగా మారిపోయాడా అనే డౌట్స్ వస్తున్నాయి. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పట్లో ఆయన్ని నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.













