అనుష్క… ది బెస్ట్ లుక్ విడుదల!
బాహుబలి, భాగమతి చిత్రాలతో స్టార్డమ్ సొంతం చేసుకున్న నటి అనుష్క. ఈ ఏడాది ప్రారంభంలో అనుష్క నటించిన భాగమతి సినిమా వచ్చింది. కమర్షియల్ విజయం సాధించింది.ఆ తర్వాత అనుష్క కొత్త చిత్రం ఏదీ మొదలుకాలేదు. నిజానికి ఆమె కథలు వింటున్నారు అంతే. అనుష్క నటన కొనసాగిస్తుందా లేదా? అని అభిమానుల్లో ఆసక్తి కలిగింది. తన ఇమేజ్‌కు తగిన పాత్రలే చేయాలనే పట్టుదలతో ఉంది. హీరో పక్కన హీరోయిన్గా పరిమితమైన పాత్రల్లో నటించేందుకు సుముఖంగా లేదనే మాట వినిపిస్తోంది. ఇటీవల రచయిత కోనా వెంకట్ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని తెలిసింది. ఇది కూడా లేడీ ఓరియంటెడ్ కథ కావడం విశేషం. ఈ సినిమాలోని అనుష్క లుక్కు సంబంధించిన ఫోటోను కోనా వెంకట్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అనుష్క కేరీర్లో ఇదే ది బెస్ట్లుక్ అని ఆయన కామెంట్ చేశారు.













