లావణ్యకు రూ.3 కోట్ల జరిమానా?
అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన లావణ్య త్రిపాఠికి కోలీవుడ్ నిర్మాతల సంఘం భారీ జరిమానా విధించింది. లావణ్యకు ఏకంగా రూ.3 కోట్ల జరిమానా విధించినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి కారణం తెలుగులో వచ్చిన 100 శాతం లవ్ చిత్రాన్ని తమిళంలో 100 శాతం కాదత్ పేరుతో జివి ప్రకాశ్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో మొదట హీరోయిన్గా లావణ్యను తీసుకున్నారు. సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. అయితే లావణ్య మాత్రం వ్యక్తిగత కారణాలతో మూవీ నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. దీంతో చిత్ర నిర్మాతలకు అప్పటి వరకు షూట్ చేసిన సీన్ల వల్ల దాదాపు రూ.3 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దాంతో లావణ్యపై ఆ రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయమైన లావణ్య త్రిపాఠి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ మూవీ నుంచి లావణ్య తప్పుకోవడంతో ప్రకాష్‌కు జోడిగా అర్జున్‌రెడ్డి ఫేం షాలినీ పాండేను తీసుకుంది చిత్ర యూనిట్.













