కోలీవుడ్ పద్ధతేం బాలేదు
మన సినిమాను వేరే ఇండస్ట్రీ వాళ్లు ప్రోత్సహిస్తున్నారు, ఆదరిస్తున్నారంటే వాళ్లకు గౌరవం ఇవ్వడం మినిమం కామన్సెన్స్. కానీ తమిళ హీరోలు, నిర్మాతలు మాత్రం ఇవేమీ తమకు పట్టవన్నట్టు ప్రవర్తిస్తున్నారు. తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్న టైమ్ లో కనీసం టైటిల్‌ను కూడా తెలుగులోకి మార్చకుండా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న అయలాన్ ను అదే టైటిల్ ఉంచేసి తెలుగులో సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా పేరుతో టైటిల్స్ ను మార్చుకుండా కావాలని వారి భాషను ప్రమోట్ చేసుకుంటుంది కోలీవుడ్ ఇండస్ట్రీ. ఈ విషయమనే కాదు, మరికొన్ని విషయాల్లో కూడా వారి ప్రవర్తన ఏ మాత్రం బాలేదు.
తెలుగులో తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న విజయ్, వారసుడు అనే డైరెక్ట్ తెలుగు సినిమా చేసి కూడా హైదరాబాద్‌లో ఒక్క ఇంటర్వ్యూ కానీ, ప్రెస్ మీట్ కానీ పెట్టలేదంటే దానికి కారణమేంటి? అజిత్ హైదరాబాద్‌కు షూటింగ్ కు వచ్చినా సరే, తన సినిమా డబ్బింగ్ రైట్స్ కొన్న నిర్మాతను కలవడానికి ఇష్టపడడు.
ఏమన్నా అంటే మేమింతే అంటారు. ఒకప్పుడు శంకర్, కమల్ హాసన్‌తో ఇండియన్ మూవీ చేస్తే దాన్ని తెలుగులో భారతీయుడు అని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ శంకరే, రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకు గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ను పెట్టాడంటే మార్పు ఎక్కడ ఉందనేది అర్థం చేసుకోవాలి. మళ్లీ రీజన్ అడిగితే పాన్ ఇండియా అంటారు. ఏదేమైనా కోలీవుడ్ పరిశ్రమ టాలీవుడ్ లో చేస్తున్న ప్రవర్తనను మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులెదురయ్యే ప్రమాదముంది.













