టాలీవుడ్ లో కోలీవుడ్ హీరోల సందడి!

టాలీవుడ్ లో స్టార్ హీరోలు సరిపోవడం లేదన్నట్లు…. కోలీవుడ్ నుండి ఇక్కడికి స్టార్ హీరోలు దిగుమతి అవుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దాదాపు పాతిక మంది హీరోలు ఉన్నారు. వారే కాకుండా కొత్తగా వచ్చేవారు పాతతరం హీరోలు కలిపి మొత్తం 50 మంది దాకా ఉన్నారు. వీరి నుంచి సంవత్సరానికి ఒక సినిమా వచ్చినా కూడా టాలీవుడ్ నుంచి ఒక్క సంవత్సరంలో దాదాపు 60 సినిమాలకు పైగా వస్తాయి. యావరేజ్ గా చూసుకున్న ఒక సినిమా ఈ రోజుల్లో 50 కోట్లకు తగ్గకుండా నిర్మితమవుతుండడంతో టాలీవుడ్ నుంచి ఏకంగా మూడు వేల కోట్లకు పైగా టర్న్ ఓవర్ జరుగుతున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే మన హీరోల సినిమాలు చూసేందుకు టైం దొరక్క మల్లగుల్లాలు పడుతుంటే… ఈ నేపథ్యంలో తమిళ తంబీల సినిమాలు కూడా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అలా తమిళ హీరోలు విడుదల చేసిన డబ్బింగ్ సినిమాలకు ఆదరణ పెరగడంతో డైరెక్ట్ తెలుగు సినిమాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు అక్కడి హీరోలు. తెలుగులో డైరెక్ట్ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ విధంగా తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయబోతున్న తమిళ హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే వంశీపైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా యాభై కోట్ల రెమ్యూనరేషన్ ను అందుకున్నారట విజయ్. తెలుగులో డబ్బింగ్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న సూర్య కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే.
టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఎస్వీసీఎల్ఎల్ పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు… శేఖర్ కమ్ముల, ధనుష్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇంతే కాకుండా తర్వాత ఇతర తమిళ హీరోలు కూడా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి ప్రణాళిక వేసుకున్నారట మరి తెలుగులో వీరు ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి. సూర్య ఇప్పటికే రక్త చరిత్ర పార్ట్ 2 సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయగా కార్తి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఊపిరి చిత్రం లో నటించారు.