తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా కొల్లి రామకృష్ణ
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ 19-04-2022 వ తేదీన స్వర్గస్థులైనందున, ఆయన స్థానం లో 27-04-2022 వ తేదీన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఫిలిం ఛాంబర్ నియమ నిబంధనలు అనుసరించి ఉపాధ్యక్షులైన కొల్లి రామకృష్ణ గారిని (మెసర్స్ రిథమ్ డిజిటల్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్), తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కొల్లి రామకృష్ణ గారి పదవీకాలం 31-07-2022 వ తేదీ వరకు ఉండునని గౌరవ కార్యదర్శులు కె యల్ దామోదర ప్రసాద్, ఎం రమేష్ తెలియచేసారు.













