హైదరాబాద్ లో ఏసుదాస్ లైవ్ షో
ఐదు దశాబ్దాలుగా ఎన్నో ఉత్తరాది, దక్షిణాది చిత్రాల్లో తన మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వరసాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు కెజె ఏసుదాస్. ఈ జర్నీలో ఆయన కొన్ని కోట్లమంది సంగీత ప్రియులను అలరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్ 11న లైవ్ కాన్సెర్ట్ చేయబోతున్నారు. గతంలో మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ హీరోయిన్, భరత నాట్యం డాన్సర్ శోభనతో ప్రోగ్రామ్‌లు నిర్వహించిన 11.2 సంస్థ ఏస్దాస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనుంది. ఏసుదాస్‌తోపాటు ఆయన తనయుడు ప్రముఖ సింగర్ విజయ్ ఏసుదాస్ సైతం లైవ్ కాన్సర్ట్‌లో పాల్గొంటాడు. లైవ్ కాన్సర్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.













