Kissik Song: కిస్సిక్ కోసం ఒకరోజే ప్రాక్టీస్ చేశారట!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వచ్చిన పుష్ప2(Pushpa2) గతేడాది డిసెంబర్ లో రిలీజై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలోని పాటలు, డ్యాన్సులకు ఆడియన్స్ ఫిదా అయిపోయారంటే ఆశ్చర్యం లేదు. అందులోనూ పుష్ప2లోని కిస్సిక్ సాంగ్(Kissik Song) ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే.
ఈ సాంగ్ లో బన్నీ(Bunny)తో కలిసి టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల(Sree Leela) కాలు కదిపింది. ముందుగా ఈ సాంగ్ ను బాలీవుడ్ హీరోయిన్ తో చేయిద్దామనుకున్నారు కానీ వాళ్లు పారితోషికం ఎక్కువ డిమాండ్ చేయడంతో ఆఖరికి కిస్సిక్ సాంగ్ ను శ్రీలీలతో చేయించారు. బన్నీ డ్యాన్స్ కు శ్రీలీల గ్రేస్ కూడా కలిస్తే సాంగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని ముందు నుంచే కిస్సిక్ సాంగ్ పై మంచి అంచనాలేర్పడ్డాయి.
సాంగ్ రిలీజయ్యాక బన్నీ, శ్రీలీల వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సాంగ్ లోని కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ సాంగ్ కు బన్నీ, శ్రీలీల కేవలం ఒకరోజు మాత్రమే ప్రాక్టీస్ చేశారని, బన్నీ- శ్రీలీల ఇద్దరూ మంచి డ్యాన్సర్స్ అవడం వల్ల ఎక్కువ కష్టపడే పని లేకుండా పాటను త్వరగా పూర్తి చేసినట్టు కొరియోగ్రాఫర్ ఊర్వశీ అప్సర(Oorvasi Apsara) రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో తెలిపింది. కిస్సిక్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయడం తన జీవితాన్నే మార్చేసిందని ఆమె ఈ సందర్భంగా అన్నారు.













