Ram Pothineni: కొత్త డైరెక్టర్ కు రాపో ఓకే చెప్పాడా?
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని(Ram pothineni) ఈమధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. ఇస్మార్ట్ శంకర్(ismart shankar) తర్వాత రామ్ కు మరో హిట్ పడలేదు. ఆ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు చేసి కష్టపడినప్పటికీ సక్సెస్ మాత్రం రామ్ కు దక్కలేదు. దీంతో నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr polishetty) డైరెక్టర్ మహేష్ బాబు.పి(mahesh babu p) దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు.
అదే ఆంధ్రా కింగ్ తాలూకా(andhra king thaluka). భాగ్య శ్రీ బోర్సే(bhagyasri borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మించగా, నవంబర్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ కు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే దానిపై ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. రామ్ తన తర్వాతి సినిమాను కొత్త డైరెక్టర్ కిషోర్(kishore) తో చేయనున్నాడని తెలుస్తోంది. ఈ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో రామ్ ఆ ప్రాజెక్టుకు సైన్ చేశారని, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా(Arka media) ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో చూడాలి.







