Rapo23: డెబ్యూ డైరెక్టర్ తో రాపో సినిమా?
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ అన్నీ ఉన్నప్పటికీ హిట్ మాత్రం అతనికి అందని ద్రాక్షలానే మిగిలిపోతుంది. అతను మరెవరో కాదు, టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni). కేవలం సరైన స్టోరీ సెలక్షన్ లేకనే రామ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇబ్బంది పడుతున్నాడు. అతని టాలెంట్ కు సరైన కథలు పడి ఉంటే ఈ పాటికే టైర్1 హీరోల్లో ఒకడిగా ఉండేవాడు.
కానీ స్టోరీ సెలక్షన్ సరిగా లేకపోవడంతో టైర్2 లో టాప్ ప్లేస్ కోసం ఇప్పటికీ పోటీ పడుతూనే ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) తర్వాత రామ్ కు మరో హిట్ పడింది లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ ఇమేజ్ కోసం పరిగెత్తి ఎదురుదెబ్బలు తగిలించుకుని తిరిగి తన పాత స్కూల్ కు వచ్చిన రాపో ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra king Thaluka) అనే సినిమా చేస్తున్నాడు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr polishetty) డైరెక్టర్ మహేష్ బాబు(Mahesh babu) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఉపేంద్ర(Upendra) ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. నవంబర్ 28 న ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ కానుంది. మరి ఈ మూవీ తర్వాత రామ్ ఎవరితో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రామ్ 23వ సినిమా గురించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. కొత్త డైరెక్టర్ అయిన కిషోర్ గోపు(Kishore Gopu) దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేయనున్నాడని, ఆ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్(Arka media Works) నిర్మించనుందని, జనవరి నుంచి ఆ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.













