Kruthika Udayanidhi: సేతుపతితో కృతిక ఉదయనిధి మూవీ
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) గురించి అందరికీ పరిచయమే. ఆయన భార్య కృతిక ఉదయనిధి (Kruthika Udayanidhi) దర్శకురాలిగా పలు సినిమాలు చేసింది. ఇప్పటికే కృతిక ఉదయనిధి దర్శకత్వంలో మూడు మూవీలు, ఓ వెబ్ సిరీస్ వచ్చాయి. కానీ అవేమీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి.
దీంతో కృతిక ఈ సారి ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని డిసైడింది. స్ట్రాంగ్ స్టోరీతో ఓ బడా హీరోతో సినిమా చేసి ఎలాగైనా హిట్ అందుకోవాలని చాలా కసిగా చూస్తోంది కృతిక. ఈ నేపథ్యంలోనే కృతిక, విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హీరోగా ఓ సినిమాను చేయనుందని నెట్టింట వార్తలొస్తున్నాయి. డైరెక్టర్ గా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కృతిక ఉదయనిధి రీసెంట్ గా కాదలిక్క నేరమిల్లై(Kadalikka Neramil Lai) అనే మూవీతో ఆడియన్స్ ను పలకరించింది.
ఇప్పుడు కృతిక తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తాను రాసుకున్న స్టోరీకి సేతుపతి అయితేనే సరిగా సరిపోతాడని భావిస్తుందట. దానికి తోడు ఆయనకు తమిళంలో మంచి క్రేజ్ కూడా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సుంది. ఇది నిజమైతే మాత్రం సేతుపతి, కృతిక కలయికకు కచ్ఛితంగా మంచి క్రేజ్ ఏర్పడటం ఖాయం.













