Kiran-Rahasya: త్వరలోనే తల్లి కాబోతున్న రహస్య.. బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం క సినిమాతో మంచి హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలుసు. ఆ సినిమా చేస్తున్న టైమ్ లోనే కిరణ్ తను ప్రేమించిన రహస్య గోరఖ్ ను పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ లోని బ్యూటిఫుల్ పెయిర్స్ లో కిరణ్- రహస్య (Kiran-Rahasya) జంట కూడా ఒకటి. అయితే ఇప్పుడు వీరిద్దరూ త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారు.
ఆల్రెడీ ప్రెగ్నెన్సీ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేసిన ఈ జంట ఇప్పుడు రహస్య సీమంతం ఫోటోలను బయటపెట్టారు. ఇటీవలే రహస్య సీమంతం ఘనంగా జరగ్గా, ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను రహస్య తన ఇన్స్టాగ్రమ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో రహస్య బేబీ బంప్ తో భలే అందంగా కనిపించింది.
బేబీ బంప్ తో ఉన్న రహస్యతో పాటూ కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా ఉన్నడు. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు లైక్స్ చేస్తూ కిరణ్, రహస్య జంటకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కాగా కిరణ్, రహస్య ఇద్దరూ కలిసి రాజా వారు రాణి గారు సినిమా కోసం వర్క్ చేశారు. ఆ సినిమా చేస్తున్నప్పుడే వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఆ జంట ఒకటైంది. పెళ్లయ్యాక రహస్య సినిమాలకు దూరంగా ఉండగా, కిరణ్ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.






