K-Ramp: 40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో మూడో వారం “K-ర్యాంప్”
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన “K-ర్యాంప్” మూవీ బాక్సాఫీస్ వసూళ్లలో సత్తా చూపిస్తోంది. ఈ సినిమా ఇప్పటిదాకా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అన్ని కేంద్రాల్లో మూడో వారం దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. మంచి కంటెంట్ ను సపోర్ట్ చేస్తామని “K-ర్యాంప్” చిత్రానికి విజయాన్ని అందించి ప్రేక్షకులు నిరూపించారు.
స్టడీ కలెక్షన్స్ తో మొదలైన “K-ర్యాంప్” సినిమా బాక్సాఫీస్ జర్నీ..పాజిటివ్ మౌత్ టాక్ తో రోజు రోజుకూ కలెక్షన్స్ గ్రాఫ్ పెంచుకుంటూ వస్తోంది. నగరాలతో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో రన్ కంటిన్యూ అవుతోంది. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు “K-ర్యాంప్” సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.







