K-Ramp: ఎనర్జిటిక్ క్యారెక్టర్ లో, కంప్లీట్ ఎంటర్ టైనర్ లో నన్ను చూడాలనుకునే అభిమానుల కోసమే “K-ర్యాంప్” మూవీ చేశాను – కిరణ్ అబ్బవరం

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా “K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
డైలాగ్ రైటర్ రవి మాట్లాడుతూ – “K-ర్యాంప్” సినిమా కథ విన్నప్పుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. ఈ కథను ఎంతో మెచ్యూర్డ్ గా తెరకెక్కించారు మా డైరెక్టర్ నాని. ప్రొడ్యూసర్ రాజేశ్ గారికి ప్రతి డైలాగ్ గుర్తుంటుంది. హీరో కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ గా పర్ ఫార్మ్ చేశారు. మీరు ట్రైలర్ లో చూసింది కొంతే. సినిమా కంప్లీట్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ సినిమా చేస్తున్న టైమ్ లోనే తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం కలిగింది. అన్నారు.
డీవోపీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ – “K-ర్యాంప్” సినిమా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. మీరు ట్రైలర్ లో చూసినదానికి వందరెట్లు ఫన్ ఫీల్ అవుతారు. కిరణ్ అబ్బవరంను ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. ఆయన ఎనర్జీ, పర్ ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.
డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ – ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నా. ట్రైలర్ లోని ఎనర్జీకి సినిమా ఏమాత్రం తగ్గదు. ఈ సినిమా ఇంత గ్రాండ్ గా వచ్చిందంటే అందుకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ కారణం. మూవీకి బడ్జెట్ పెరిగినా మా ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేసి ఇన్వెస్ట్ చేశారు. మ్యూజిక్, ఎడిటింగ్, డీవోపీ..ఇలా మా టీమ్ లోని వాళ్లంతా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కిరణ్ గారి పర్ ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ సర్ ప్రైజ్ చేస్తుంది. నరేష్ గారి క్యారెక్టర్ రివీల్ చేయొద్దనే ట్రైలర్ లో ఆయన డైలాగ్స్ పెట్టలేదు. సినిమా చూసి కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. మిమ్మల్ని మూవీ ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ రాజేశ్ దండా మాట్లాడుతూ – మా సినిమా జనాల్లో ఉందని తెలుసు కానీ ఈ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో వచ్చినవారిని చూస్తుంటే మా సినిమా కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమైంది. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా పెద్ద వేదిక మీద ట్రైలర్ లాంఛ్ చేస్తే బాగుండును అనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం చాలా పెద్ద ప్లేస్ లో చేసుకుందాం. ఇది కిరణ్ గారి ఫ్యాన్స్ కు నేను చెబుతున్నా. కిరణ్ గారు పవన్ కల్యాణ్ గారి ఫ్యాన్, మా డైరెక్టర్ మహేశ్ బాబు గారి ఫ్యాన్ , నేను బాలకృష్ణ గారి అభిమానిని. మా హీరో స్టైల్ లో తొడగొట్టి చెబుతున్నా ఈ దీపావళికి వస్తున్న నాలుగు సినిమాలు హిట్ కావాలి. అందులో మన తెలుగు హీరో కిరణ్ చేసిన “K-ర్యాంప్” ఒక మెట్టు పైనే ఉండాలి. మా సినిమా రిలీజ్ డేట్ ను చాలా రోజుల కిందటే ఫిక్స్ చేశాం. పెద్ద బ్యానర్స్ నుంచి దీపావళికి సినిమాలు వస్తున్నాయి. అయినా మా మూవీకి థియేటర్స్ దొరుకుతాయి. కంఫర్ట్ గా రిలీజ్ చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మిగతా చిత్రాలతో పాటు మా మూవీ కూడా సక్సెస్ అయ్యి వారి బ్యానర్స్ లాగే మా సంస్థకూ పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
యాక్టర్ వీకే నరేష్ మాట్లాడుతూ – దీపావళి పండక్కి మీరు కొనే టపాసు రెండు నిమిషాలే ఉంటుంది. కానీ మీరు కొనే టిక్కెట్టుతో మా సినిమా రెండు గంటలు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. ఈ దీపావళి నైట్ కె ర్యాంప్ థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం. సామజవరగమన సినిమాతో ఈ సంస్థ నన్ను కొత్తగా చూపించింది. ఈ చిత్రంతో మరింత వైవిధ్యమైన పాత్రతో మీ ముందుకు వచ్చే అవకాశం కల్పించింది. కిరణ్ తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశాను. ఈ తరంలో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ జైన్స్ నానితో కె ర్యాంప్ మూవీ చేయడం హ్యాపీగా ఉంది. ఈ కాంబో నుంచి మరిన్ని కె ర్యాంప్ వంటి ఎనర్జిటిక్ మూవీస్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “K-ర్యాంప్” ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇంత భారీగా వస్తారని మేమూ ఊహించలేదు. లేకుంటే మరో ప్లేస్ లో చేసేవాళ్లం. ఈవెంట్ లోపలికి రాలేక బయటే ఉండిపోయిన వారికి సారీ చెబుతున్నా. కొత్త స్క్రిప్ట్ చేద్దామనే ఉద్దేశంతో క అనే సినిమాను చేశాను. అయితే “K-ర్యాంప్” ర్యాంప్ మాత్రం మీకోసం నా ఫ్యాన్స్ కోసం చేశాను. అప్పటికి నేను ఒక్క సినిమానే చేసినా నా రెండో చిత్రం ఎస్ఆర్ కల్యాణమండపంను థియేటర్స్ లో చూసి మీరంతా ఆదరించారు. నా పర్ ఫార్మెన్స్ ను ఎంజాయ్ చేశారు. అప్పటి నుంచి నాని నాతో మూవీ చేయాలని అడుగుతూ వచ్చారు. “K-ర్యాంప్” మూవీకి కర్త కర్మ క్రియ అన్నీ నానీనే. ఈ సినిమా చేస్తున్నంతసేపూ నా నవ్వు ఇలాగే ఉంది. అంత బాగా నన్ను మా ప్రొడ్యూసర్స్ చూసుకున్నారు. ఈ చిత్రంలో నా క్యారెక్టరైజేషన్ ఇప్పుడున్న జనరేషన్ యూత్ కు దగ్గరగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఫ్రస్టేషన్ తో వాళ్లు ఎలా మాట్లాడుతారో నేనూ అలాగే మాట్లాడుతా. అయితే ఆ డైలాగ్స్ తో చూసేవారికి ఎవరికీ ఇబ్బంది ఉండదని మాత్రం చెప్పగలను. నాకు ఇలాంటి ఈజ్ తో ఉన్న క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. లక్కీగా నాని అలాంటి క్యారెక్టర్ నా దగ్గరకు తీసుకొచ్చాడు. లాస్ట్ ఇయర్ దీపావళి కంటే ఈ దీపావళికి ఇంకా బాగుంటుంది నన్ను చూసి నమ్మండి. మీరు థియేటర్స్ లో గట్టిగా నవ్వుకుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడండి ఎంటర్ టైన్ అవుతారు. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న మిగతా చిత్రాలకు కూడా నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. ఈ దీపావళికి ఇండస్ట్రీలోని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. అన్నారు.