Kiran Abbavaram: ఏకంగా 8 సినిమాలతో బిజీ బిజీ

రాజా వారు రాణి గారు(Raja varu Rani garu) సినిమాతో హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(KA) సినిమాతో సొంత బ్యానర్ లోనే సూపర్ హిట్ ను అందుకుని తన మార్కెట్ ను పెంచుకున్నాడు. క సినిమా ఇచ్చిన సక్సెస్ తో కిరణ్ వరుసగా ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అందులో భాగంగానే చెన్నై లవ్ స్టోరీ(Chennai love story) చేస్తున్న కిరణ్ అబ్బవరం త్వరలోనే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
మొత్తానికి కిరణ్ అబ్బవరం చేతిలో ఇప్పుడు 8 సినిమాలున్నాయి. టాలీవుడ్ యూత్ హీరోల్లో ఎక్కువ సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరయా అంటే అందరూ కిరణ్ పేరే చెప్తుండటం చూసి విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఒకేసారి ఎక్కువ సినిమాలను చేస్తూ, డిఫరెంట్ కథలతో తన కెరీర్ గ్రాఫ్ ను విపరీతంగా పెంచుకుంటున్నాడు కిరణ్ అబ్బవరం.
అందులో భాగంగానే జైన్స్ నాని(Jains Nani) డైరెక్షన్ లో కె ర్యాంప్(K ramp) సినిమా చేస్తున్నాడు అబ్బవరం కిరణ్. దాంతో పాటూ సుకుమార్ రైటింగ్స్(Sukumar writings) బ్యానర్ లో సుకుమార్ అసోసియేట్ అయిన రంగ(Ranga)దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా మిర్జాపూర్(Mirzapur) ఫేమ్ ఆనంద్ అయ్యర్(Anand Iyer) దర్శకత్వంలో ఓ సినిమాకు కూడా కిరణ్ కమిట్ అయ్యాడు. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనుందని అంటున్నారు. మరి ఈ సినిమాలు కిరణ్ కు ఎలాంటి ఫలితాల్ని అందిస్తాయో చూడాలి.