పాన్ ఇండియా ఏంటన్న వారికి ఆ హీరో ఆన్సర్ ఇదే
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కు గత కొన్ని సినిమాలుగా పరాజయం చూస్తూనే ఉన్నాడు. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో 'క' అనే డిఫరెంట్ టైటిల్ తో ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నాడు. వాస్తవానికి కిరణ్ ఈ సినిమా కంటే ముందే దిల్ రుబా అనే సినిమా రిలీజ్ కావాల్సింది కానీ వరుస ఫ్లాపుల వల్ల ఈ సారి లవ్ ఎంటర్టైనర్తో పనయ్యేట్లు లేదని డిఫరెంట్ జానర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
అందులో భాగంగానే ఈ సినిమాను ముందుకు జరిపాడు. అయితే ఈ సినిమాలో కిరణ్ కేవలం హీరో మాత్రమే కాదు. నిర్మాత కూడా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది. కిరణ్ కెరీర్లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా. హీరోగా ఇంకా ఓ స్పెషల్ ఇమేజ్ రాకుండానే పాన్ ఇండియా సినిమాలు ఎందుకనే ప్రశ్న రీసెంట్ గా కిరణ్ కు ఎదురైంది. దానికి కిరణ్ సమాధానమిస్తూ, కాంతార, మంజుమ్మల్ బాయ్స్ సినిమాలు వచ్చినప్పుడు అందులో హీరో స్టేటస్ ను చూసి ఆడియన్స్ థియేటర్లకు వెళ్లలేదని, కంటెంట్ నచ్చడం వల్లే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయని చెప్పాడు. కిరణ్ చెప్పింది ముమ్మాటికీ నిజమే. కేవలం కంటెంట్ తో హిట్ అవుతున్న సినిమాలు ఈ మధ్య చాలానే వచ్చాయి. ఇప్పుడు కిరణ్ అబ్బవరం 'క' కూడా ఆ లిస్ట్ లో చేరాలని ఆశిద్దాం.













