Killer: సైన్స్ ఫిక్షన్ మూవీగా “కిల్లర్” సర్ ప్రైజ్ చేస్తుంది – డైరెక్టర్ పూర్వజ్
జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా “కిల్లర్” (Killer). చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ను ఈ రోజు హైదరాబాద్ లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో
యాక్షన్ కొరియోగ్రాఫర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ – జ్యోతి గారు తనకు యాక్షన్ తెలియదు అనేవారు. కానీ మేము 15 మందితో అటాక్ చేసే ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాం. ఆ సీక్వెన్స్ రెడీ చేయడానికి మాకు 3 గంటలు టైమ్ పట్టింది. కానీ జ్యోతి గారు వచ్చి అరగంటలో మొత్తం యాక్షన్ పార్ట్ చేశారు. మేము షాక్ అయ్యాం. ఈ సినిమాలో జ్యోతి గారు చేసిన యాక్షన్ సీక్వెన్సులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నారు.
యాక్టర్ సీతారామ్ మాట్లాడుతూ – డైరెక్టర్ పూర్వజ్ చాలా కష్టపడతారు. జ్యోతి గారిని టీవీల్లో చూశాం. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద మనల్ని ఆకట్టుకోబోతున్నారు. ఆమె ఈ చిత్రంలో అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. “కిల్లర్” సినిమా చూసిన ఆడియెన్స్ సర్ ప్రైజ్ అవుతారు. అన్నారు.
యాక్టర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ – ఈ చిత్రంలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలా అడుగుపెట్టా. నాలోని విలనీని కొత్తగా తెరపై చూపించబోతున్నారు దర్శకులు పూర్వజ్. విజువల్స్ సూపర్బ్ గా వచ్చాయి. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. అన్నారు.
యాక్టర్ విశాల్ రాజ్ మాట్లాడుతూ – “కిల్లర్” సినిమాలో జ్యోతి పూర్వజ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆమె ఈ చిత్రంలో బాగా పర్ ఫార్మ్ చేశారు. తన కోసమైనా ఈ సినిమాను మీరు చూడాలి. డైరెక్టర్ పూర్వజ్ తో వర్క్ చేయడం ఏ నటుడికైనా సులువు. మనకెంతో ఫ్రీడమ్ ఇస్తారు. మీతో పాటే నేను ఈ సాంగ్ చూస్తున్నా. డైరెక్టర్ పూర్వజ్ ఇంకా పెద్ద మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ చందు మాట్లాడుతూ – ఇప్పటిదాకా మీరు సినిమాల్లో చూడని కంటెంట్ ఈ కిల్లర్ మూవీలో చూస్తారు. జ్యోతి గారి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూస్తారు. నేను పూర్వజ్ గారిని ఇంటర్వ్యూ చేసిన టైమ్ లో నీకు యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఆయన చేసిన నాలుగు సినిమాల్లో మూడింటిలో అవకాశం కల్పించారు. సుకు గారికి థ్యాంక్స్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నన్ను యాక్టర్ చందుగా ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. అన్నారు.
యాక్టర్ గౌతమ్ చక్రధర్ మాట్లాడుతూ – నేను యాక్టర్ కావాలనేది మా అమ్మ డ్రీమ్. ఈ సినిమాతో నన్ను తెరపై చూసుకోబోతున్నా. ఈ చిత్రంలో బ్యూటిఫుల్ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ పార్ట్స్ ఉంటాయి. వాటి కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో మీరు ఊహించుకోవచ్చు. డైరెక్టర్ పూర్వజ్ మనందరికీ నచ్చేలా ఈ సినిమాను రూపొందించారు. అన్నారు.
ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి.ఎ. మాట్లాడుతూ – మనం లైఫ్ లో గర్వపడే సందర్భాలు కొన్ని ఉంటాయి. పూర్వజ్ ను ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను గర్వపడుతున్నా. తనతో కెరీర్ ప్రారంభించిన వారందరినీ తన మూవీలో ఉండేలా చూసుకోవడం పూర్వజ్ ప్రత్యేకత. ఈ సినిమా ప్రారంభించినప్పుడు కూడా ఇంత బాగా ఔట్ పుట్ వస్తుందని అనుకోలేదు. ఈ పాటలో చూపించినట్లు ఫైర్, ఐస్ తనలోనూ ఉన్నాయి. కిల్లర్ మూవీలోని విజువల్స్, సాంగ్స్ వంటి ఔట్ పుట్ చూసి సర్ ప్రైజ్ అయ్యాం. ఈ సినిమాలో కిల్లర్ పర్ ఫార్మెన్స్ లు చూస్తారు. అన్నారు.
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ – నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ ఆ డ్రీమ్ పక్కనపెట్టి ఐటీ కంపెనీలో వర్క్ చేయాల్సివచ్చింది. ఆ తర్వాత సీరియల్స్ చేసి పాపులర్ అయ్యాను. ఇప్పుడు హీరోయిన్ గా మీ ముందుకు వస్తున్నాను. ఇవన్నీ నేను లైఫ్ లో ప్లాన్ చేయలేదు. అలా జరుగుతూ వస్తున్నాయి. యాక్టర్ అయ్యాక మంచి స్టంట్స్ తో యాక్షన్ మూవీ ఒకటి చేయాలని ఉండేది. ఆ విషయం పూర్వజ్ కు చెప్పాను. ఒకవైపు మాస్టర్ పీస్ సినిమా జరుగుతుండగానే ఈ “కిల్లర్” సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాడు. స్క్రిప్ట్ చదివాక మనం ఇంత భారీ స్కేల్ లో సినిమా ఎలా చేయగలం అని అన్నాను. కానీ తనకున్న పరిచయాలతో, స్నేహితులతో చూస్తుండగానే సినిమాను రూపొందించాడు. ఈ మూవీలో బాగా పర్ ఫార్మ్ చేశానని మా యూనిట్ వాళ్లు చెబుతున్నారు. పూర్వజ్ చెప్పినట్లూ చేస్తూ వెళ్లా. ఒక కొత్త తరహా కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ – తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది. ఇలాంటి టైమ్ లో మేము చేసిన “కిల్లర్” సినిమా మరో సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఐదు డిఫరెంట్ రోల్స్ లో నటించింది. స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై ఇలా ఐదు భిన్నమైన పాత్రల్లో ఆమె అద్భుతంగా నటించింది. వీటిలో కొన్ని క్యారెక్టర్ లుక్స్ ను పరిచయం చేశాం. వాటికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర కథకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఎలిమెంట్స్ ముడిపడి ఉంటాయి. ఈ ఐదు పాత్రలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ముడిపడి ఉన్న ఆ ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. మీరు ఇప్పుడు చూసిన గ్లింప్స్ అయినా, సాంగ్ అయినా మా రష్ లో 3 పర్సెంట్ కూడా ఉండవు. మిగతా కంటెంట్ సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. నేను మాస్టర్ పీస్ అనే సినిమా చేస్తున్న టైమ్ లో “కిల్లర్” మూవీ ఆలోచన వచ్చింది. ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి, ఇతర టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. అన్నారు.






