ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ
అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్న ప్రభాస్-నాగ్అశ్విన్ సినిమాలో కీలకపాత్ర కోసం బాలీవుడ్ స్టార్స్‌ను తీసుకోవాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారని తెలిసింది. ఇక ప్రభాస్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్లోనే ఆమెను సంప్రదించారని, లాక్డౌన్ తర్వాత ఫైనల్ చేయనున్నారని కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో విన్పిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అశ్వనీదత్ ఈ చిత్రం విఎఫ్ఎక్స్ కోసం రూ.50 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయించారని తెలిసింది.













