అక్షయ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కియరా అద్వాని
భరత్ అనే నేను చిత్రంలో తెలుగులో అడుగుపెట్టిన కథానాయిక కియరా అద్వాని. ఇప్పుడు బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. అక్కడ కబీర్ సింగ్ చిత్రంలో కథానాయికగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. దీంతో తాజాగా ఆమెకు మరో రెండు భారీ చిత్రాల్లో చేసే అవకాశం వచ్చింది. అదీ ప్రముఖ దర్శకుడు నిర్మాత కరణ్ జోహర్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రాల్లో ఈమె కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం ఈమెతో తెలుగు దర్శక నిర్మాతలు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా కథలు వినడానికి ఆమెకు ఖాళీ లేదట. ఆమె వద్దకు ఎవరు కథలు వినిపించాలని వెళ్లినా తర్వాత చూద్దామని చెబుతుందట. కియా అద్వాని మహేశ్‌బాబు చేసిన భరత్ అనే నేను, రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ లో నటిచింది. ఇప్పుడు అక్షయ్‌తో ఈమె రెండు సినిమాలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.













