బన్నీ సరసన కియారా అద్వానీ ?
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తరువాత చిత్రాన్ని అల్లు అర్జున్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ సరసన నటించే హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు ముమ్మరంగా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమలో బన్నికి జోడీగా కియరా అద్వానీ హీరోయిన్గా తీసుకోబోతున్నారట. ప్రస్తుతం ఆమె మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి జోడిగా వినయ విధేయ రామ లో నటించింది. ఈ చిత్రం జనవరి 11వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక బన్నీ త్రివిక్రమ్ సినిమా జనవరిలో చిత్రం ప్రారంభమవనుంది.













