అఖిల్ సరసన స్టార్ హీరోయిన్?
విరామం తీసుకోకుండా వెంటనే కొత్త సినిమాని ప్రకటిస్తానన్నారు అఖిల్ అక్కినేని. కానీ మిస్టర్ మజ్నుకి బాక్సాఫీసు దగ్గర మిశ్రమ స్పందన లభించడంతో, ఇదివరకటిలాగే ఆచి తూచి అడుగులేస్తున్నారు. పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నాక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయాలని అఖిల్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్టు సిద్ధం కావడంతో, చిత్రవర్గాలు కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టారు. భారత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో సందడి చేసిన కియరా అడ్వాణీతో అఖిల్ ఆడిపాడే అవకాశాలున్నట్టు తెలిసింది. అఖిల్ ఇప్పటిదాకా కొత్త భామలతోనే కలిసి నటించారు. ఈసారి మాత్రం అఖిల్ కోసం స్టార్ హీరోయిన్నే ఎంపిక చేయాలని చిత్రబృందం భావించడంతో కియరా అడ్వాణీ పేరు తెరపైకొచ్చిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. త్వరలోనే కథానాయిక విషయంలో అధికారికంగా సృష్టత వచ్చే అవకాశం ఉంది.













