కియారా డిమాండ్ మామూలుగా లేదుగా
భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కియారా అద్వానీ ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. భరత్ అనే నేను తర్వాత కియారా తెలుగులో చేసిన సినిమా వినయ విధేయ రామ ఒక్కటే. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో కియారా బాలీవుడ్ కే పరిమితమైంది. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ లో ఛాన్స్ అందుకుంది.
బాలీవుడ్ లో ఎన్టీఆర్- హృతిక్ కలయికలో వస్తున్న వార్2లో కూడా కియారా కన్ఫర్మ్ అని వార్తలొస్తున్నాయి. కానీ కియారా ఎన్టీఆర్కు జోడీగా నటిస్తుందా లేదా హృతిక్ కు జోడీగా నటిస్తుందా అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇదిలా ఉంటే డాన్3 లో రణ్వీర్ సింగ్ తో కలిసి కియారా నటించనుంది.
ఈ సినిమా కోసం అమ్మడు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వింటే మతిపోవాల్సిందే. ముంబై మీడియా వర్గాల ప్రకారం డాన్3 మూవీ కోసం కియారా ఏకంగా రూ.13 కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందట. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ ను అనుకున్నప్పటికీ రణ్ వీర్ సింగ్ డిమాండ్ చేయడంతో ఆ స్థానంలోకి కియారా వచ్చింది. అయితే డాన్3 సినిమాకు అమ్మడు ఇంత ఛార్జ్ చేయడం వెనుక ఉన్న అసలు కారణం సినిమాకు ఎక్కువ కాల్షీట్స్ అవసరం పడటమే అని తెలుస్తోంది. కియారా రెమ్యూనరేషన్ చూస్తుంటే బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ వైపు అడుగులేస్తూ అనధికారికంగా నెం.1 ప్లేస్ లో కూర్చుందని చెప్పొచ్చు.













