ఒక సినిమా అయినా ఆయనతో చేయాలనుంది
ఐదేండ్ల క్రితం నా స్థానం ఎక్కడో ఉండేది. ఇప్పుడు మంచి స్థాయికి వచ్చా. మరో ఐదేండ్లలో ఉత్తమ నటిగా, అత్యుత్తమ స్థానంలో ఉండాలనుకుంటున్నా అని అంటోంది కైరా అద్వానీ. ఈ ఏడాది కబీర్ సింగ్ తో అందరి చూపులను తనవైపు తిప్పుకున్న కైరా బాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తన సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ కబీర్‌సింగ్ నా కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇటీవల గుడ్‌న్యూస్ ప్రమోషన్లో భాగంగా ఛండీఘర్ వెళ్ళినప్పుడు అంతా నన్ను ప్రీతి కబీర్ సింగ్ అని పిలవడం ఎంతో హ్యాపీనిచ్చింది. ఈ చిత్రం నాకు వెలకట్టలేని గుర్తింపుని, అభిమానాన్నిచ్చింది. నాలో కూడా చాలా మార్పుని తీసుకొచ్చింది. రణ్వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, వరుణ్ థావన్ ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ సార్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనుంది అని తెలిపింది.













