సూపర్‌స్టార్ కి నో చెప్పిన కియారా!
సూపర్‌స్టార్ మహేష్ బాబు మరో క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేశారు. ఆయన ఫైనల్‌గా దర్శకుడు పరుశురామ్ స్క్రిప్ట్‌ను ఒకే చేశారు. త్వరలో ఈ మూవీని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో మహేష్ కోసం అప్పుడే హీరోయిన్ని వెతికే పనిలో చిత్ర బృందం ఉందట. కాగా దర్శకుడు పరశురాం ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌ని కియారా సున్నితంగా తిరస్కరించిందని తెలిసింది. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేనని ఆమె చెప్పిందట. అలాగే మరో రెండేళ్ల తన క్యాలెండర్ ఖాలీ లేదని ఆమె అన్నట్లు సమచారం.













