కాబోయేవాడు అలా ఉండకూడదు
బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా చిత్రాలు చేస్తోంది. బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న కియారా అద్వానీ తాజాగా తాను పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలో చెప్పింది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఎప్పుడు కూడా సరదాగా ఉండాలి. సందర్భం ఎలాంటిది అయినా కూడా జోవియల్గా ఉండే వాడు అయితే నాకు నచ్చుతాడు. ఇక నా అభిప్రాయాలు, ఆలోచనలకు విలువనిచ్చే వ్యక్తిని నేను కోరుకుంటున్నాను. ఇక చివరగా ముక్కు మీద కోపం ఉండే వ్యక్తి అయితే నాకు అస్సలు వద్దు అని కియారా పేర్కొంది.













