షరా మాములే…. అక్కతో పాటు చెల్లెలు!
స్టార్ హీరోయిన్ కూతుళ్లు స్టార్ హీరోయిన్ చెల్లెలు ఇలా ఒకరి తరువాత ఒకరు సినిమా రంగంలోకి పరిచయం కావడం షరా మాములే. ఇక అసలు విషయానికొస్తే…. అతిలోక సుందరి శ్రీదేవి, బోనీకపూర్లకు ఇద్దరు కూతుర్లన్న విషయం తెలిసిందే. శ్రీదేవికి తన పెద్ద కుమార్తె జాన్వి కపూర్ అంటే చాలా ఇష్టం. ఆమె తాను బతికుండగానే జాహ్నవిని వెండితెరపై చూడాలని కలలు కనేది. కానీ అది నెరవేరకముందే అంటే ధడక్ మూవీ రిలీజ్ కి ముందే శ్రీదేవి హఠాన్మరణం చెందింది. ప్రస్తుతం జాహ్నవి పవన్ కళ్యాణ్ సరసన తెలుగు సినీ రంగానికి కూడా పరిచయం అవుతుంది. ఇక శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ కపూర్ నాన్న కూచీ. తల్లి పెద్ద కుమార్తెనినటిని చేయాలని ఆరాటపడితే తండ్రి బోనీ కపూర్ తన చిన్నకుమార్తెని వెండితెరపై చూడాలనఆశపడుతున్నాడు. అయితే శ్రీదేవి పెద్ద కుమార్తెతో పోలిస్తే చిన్న కూతురు పెద్ద అంద గత్తె కాదు. ఇంకా నిజం చెప్పాలంటే అతిలోక సుందరి శ్రీదేవి అందం ఏ ఒక్క కూతురికి రాలేదు. ఇక చిన్న కూతురికి కాస్త పళ్లు కూడా ఎక్కువే. అయితేనేం స్టార్ కిడ్స్ లకి ఎన్నిలోపాలు ఉన్నా వాటిని సర్జరీలతో అందంగా మారుస్తారు కాబట్టి వారు ఎలా ఉన్నారు అనే దిగులు లేదు.
ఇక శ్రీదేవి, బోనీకపూర్ ల కుమార్తె కావడంతో అవకాశాల కోసం కూడా పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కాబట్టి నో ప్రాబ్లం. అందునా అక్కతో పాటు చెల్లికి కూడా బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహా్ర్ చేతిలో పెట్టారు కాబట్టి అవన్నీ కరణ్ చూసుకుంటాడు. ఇప్పటివరకు కరణ్ దాదాపు అరడజను బాలీవుడ్ కిడ్స్ ని పరిశ్రమకు పరిచయం చేసిన అనుభవం కూడా ఉంది. శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి, చుంకీ పాండే కూతురు అనన్యపాండేలతో పాటు తదుపరి షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ని పరిచయం చేయనున్నాడు.
ఇక ఖుషీ విషయానికి వస్తే ఇప్పటికే ఈమె విదేశాలలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంది. కెమెరా వెనక చాలా పనులను నేర్చు కుంది. డిప్లమా సర్టిఫికేట్ ని కూడా అందుకుంది. పంతొమ్మిది ఏళ్ల టీనేజ్ అమ్మాయి అయిన ఖుషీ కపూర్ కి సంబంధించి పరిచయం చేయబోయేందుకు అన్ని సన్నాహాలు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఈమె ఫ్యాషనిస్ట్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. తాజాగా ఈమె తన తల్లి, తన అక్కయ్య జాహ్నవితో కలిసి ఉన్న పాత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇవన్నీ అభిమానుల మద్య బాగావైరల్ అవుతున్నాయి.













