Khushi Kapoor: ఏ సినిమాకైనా అదే ముఖ్యం: ఖుషి కపూర్
శ్రీదేవి(Sridevi) నట వారసురాలిగా ఖుషి కపూర్(Khushi Kapoor) ఇప్పటికే ది ఆర్చీస్(The Archies) సినిమాతో అరంగేట్రం చేసి ఆ సినిమాతో ఫ్లాప్ ను అందుకుంది. అయితే ప్రస్తుతం ఖుషి నటించిన లవ్ యాపా(Love Yaapa) సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. లవ్ యాపా ప్రమోషన్స్‌లో భాగంగా ఖుషి మీడియాకు ఇంటర్వ్యలిస్తూ తెగ బిజీగా ఉంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఖుషి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఏ సినిమాకైనా ప్రమోషన్స్ చాలా ముఖ్యమని, మనం దేన్నైనా ప్రేక్షకుల వరకు తీసుకెళ్తేనే వారు ఆదరిస్తారని, అలా కాకుండా చూస్తారులే అనుకుంటే కుదరదని ఈ సందర్భంగా ఖుషి తెలిపింది. లవ్ యాపా అందరి కంటే యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుందని, కచ్ఛితంగా ఈ మూవీని యువతంతా ఆదరిస్తారని ఖుషి భావిస్తోంది.
అయినా మనం చేసిన మూవీ ప్రతీ ఒక్కరికీ నచ్చాలని లేదని, తన ఫస్ట్ మూవీ ది ఆర్చీస్ కీ, ఇప్పటికీ తాను చాలా నేర్చుకున్నానని, కథల ఎంపిక విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఖుషి వెల్లడించింది. లవ్ యాపా ట్రైలర్ రిలీజ్ సమయంలో బిగ్ స్క్రీన్ పై తనను తాను చూసుకున్నప్పుడు ఒణికిపోయానని, కానీ అది చూసి ఎంతో సంతోషపడ్డానని ఖుషి ఈ సందర్భంగా వెల్లడించింది. సినిమా సక్సెస్ అనేది కలెక్షన్స్ పై ఉంటుంది కాబట్టి ఆ కలెక్షన్స్ రావడానికి తన వంతు కృషి చేస్తానని ఖుషి ఈ సందర్భంగా చెప్పింది.













