దక్షిణాది వారిని ఎందుకు ఆహ్వానించలేదు ?
గాంధీ 150వ జయంతిని స్మరించుకుంటూ ప్రధాన మంత్రి కార్యాలయం నిర్వహించిన ఛేంజ్ వితిన్ మీట్ కార్యక్రమానికి బాలీవుడ్ పరిశ్రమకు చెందినవారిని మాత్రమే ఆహ్వానించడంపై నిరసన గళం వినిపిస్తోంది. ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి ఖుష్బూ ఈ విషయమై ట్వీటర్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయానికి ఓ విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. కేవలం హిందీ చిత్రాలే మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం లేదు. దక్షిణాది పరిశ్రమ ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద బలంగా ఉంది. దక్షిణాది చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఉత్తమ ప్రతిభావంతులు, నటులు, సూపర్స్టార్లు, సాంకేతిక నిపుణులు దక్షిణాది నుంచే ఉన్నారు. మరి ఎందుకు ఆ కార్యక్రమానికి దక్షిణ పరిశ్రమలకు చెందినవారిని ఆహ్వానించలేదు? ఎందుకీ అసమానత? అని ట్వీట్ చేశారు ఖుష్బూ.













