Nayanathara: మరో గొడవలో నయనతార.. అసంతృప్తిలో డైరెక్టర్
ఎప్పుడూ ఏదొక వివాదాల్లో చిక్కుకునే నయనతార(Nayanathara) మొన్నటివరకు ధనుష్(Dhanush) తో గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మూకుతి అమ్మన్2 (Mookuthi Amman2) పూజా కార్యక్రమంలో మీనా(Meena) ను అవమానపరిచారని నయన్ ను అందరూ విమర్శించిన విషయం తెలిసిందే. అది సమసిపోయే లోపే ఇప్పుడు నయన్ మరో గొడవలో చిక్కుకుంది.
సుందర్ సి(SundarC) దర్శకత్వంలో వస్తోన్న మూకుతి అమ్మన్2 సెట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ కు, నయనతారకు మధ్య గొడవైందని, దీంతో నయన్, సుందర్ మధ్య విబేధాలు వచ్చాయని, నయన్ ప్రవర్తనపై అసంతృప్తిగా ఉన్న సుందర్ సినిమా షూటింగ్ నిలిపివేశారని తెలుస్తోంది. నయనతారను హీరోయిన్ గా తప్పించి మరో సీనియర్ నటితో ఈ మూవీని పూర్తి చేయాలని కూడా డైరెక్టర్ అనుకున్నాడట.
కానీ నిర్మాత జోక్యం చేసుకుని నయనతారతో చర్చించి సమస్యను సాల్వ్ చేశారని అంటున్నారు. దీంతో మూకుతి అమ్మన్2 షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయిందని, ప్రస్తుతం చెన్నైలోని ఓ టెంపుల్ లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా మూకుతి అమ్మన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.













