Khushboo: అరుదైన సమస్యతో బాధ పడుతున్న ఖుష్బూ
నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా ఆమె బాగా పాపులరైన ఖుష్బూ(Khushboo) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాను గాయాల పాలైనట్టు తెలుపుతూ కొన్ని ఫోటోలను ఖుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన ఖుష్బూ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా తన ఎడమ చేతిని చూపిస్తూ ఆ చేతికైన గాయాల ఫోటోలను ఖుష్బూ షేర్ చేసింది.
ఖుష్బూ గత కొంతకాలంగా కండరాల ఎలర్జీకి గురై తీవ్ర నొప్పితో బాధ పడుతోందట. మామూలుగా ఆటగాళ్ళు భారీ ఎక్సర్సైజ్లు చేయడం వల్ల ఇలాంటి కండరాల ఎలర్జీతో బాధ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఖుష్బూ కూడా అలాంటి ఇబ్బందే పడుతుందని సమాచారం. గతంలో చాలా లావుగా ఉండే ఖుష్బూ తన వ్యాయామాలతో చాలా స్లిమ్ గా మారిన విషయం తెలిసిందే.
అందుకే ఆమె ఇప్పుడు కండరాల ఎలర్జీతో బాధ పడుతుందంటున్నారు. దీంతో ఖుష్బూ చేతికి డాక్టర్లు ఫిజియోథెరపీ చేస్తున్నారు. అయితే ఇంత బాధలో కూడా ఖుష్బూ షూటింగుల్లో పాల్గొంటుందట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమెకి సూచిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఖుష్బూ ఈ మధ్య జబర్దస్(jabardasth) షో కు జడ్జిగా వ్యవహరిస్తూ తన కామెడీతో అందరినీ ఆకట్టుకుంటుంది.













