Khaidhi2: ఖైదీ2పై అప్డేట్ ఇచ్చిన కార్తీ
కార్తీ(Karthi)- లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కలయికలో 2019లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఖైదీ(Khaidhi). ఈ మూవీ హిట్ అవడంతో పాటూ మంచి కలెక్షన్లను కూడా అందుకుంది. ఇందులో కార్తీ డిల్లీ అనే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఆ సినిమాతో కార్తీ, లోకేష్ ఇద్దరూ ఎంతో సక్సెస్ అందుకోవడంతో పాటూ మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పట్నుంచో అంటున్నారు తప్పించి ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు. తాజాగా ఖైదీ సీక్వెల్ గురించి ఓ అప్డేట్ బయటికొచ్చింది. లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్(Rajinikanth) తో చేస్తున్న కూలీ(Coolie) మూవీ పూర్తవగానే ఖైదీ2(Khaidhi2) స్టార్ట్ అవనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరెక్ట్ గా హీరో కార్తీనే రివీల్ చేశాడు.
రీసెంట్ గా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ కు కార్తీ ఓ కడియాన్ని గిఫ్ట్ గా ఇచ్చి త్వరలోనే డిల్లీ మళ్ళీ తిరిగొస్తున్నాడు. ఈ ఇయర్ మీకు వండర్ఫుల్ గా గడిచిపోవాలని లోకేష్ కు విషెస్ చెప్పగా, దానికి లోకేష్ డిల్లీని ఓ బ్యాంగ్ తో వెనక్కి తీసుకొద్దామని రిప్లై ఇచ్చాడు. దీంతో ఖైదీ సీక్వెల్ పై అందరికీ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది.













