ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందా? లేదా?
ఎన్టీఆర్, కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ కాంబినేషన్ లో సినిమా రానుందని మొన్నీ మధ్యే క్లారిటీ కూడా వచ్చేసింది. కేజీఎఫ్2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా తారక్ తోనే ఉంటుందనుకున్నారు కానీ ఆయన ప్రభాస్ తో సలార్ సినిమా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లైనప్ లో మార్పులు రావడం వల్ల అసలు ప్రశాంత్ తో సినిమా ఉంటుందో లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్ తో ఒక సినిమా, ప్రశాంత్ తో ఒక సినిమా అని కన్ఫార్మ్ న్యూస్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అనివార్య కారణాల వల్ల త్రివిక్రమ్ తో సినిమా క్యాన్సిల్ అయి, తన తర్వాతి సినిమాను కొరటాల తో లైన్ లో పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ తో సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా రేడియేషన్ ప్రాజెక్ట్ అంటూ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచింది. అలాంటి సినిమా ఇప్పుడు ఉంటుందా లేదా అనేది ప్రశ్నగా మిగిలింది.
ఒకవేళ సలార్ తర్వాత ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందనుకోవడానికి, ప్రశాంత్ తర్వాతి సినిమా బన్నీ తో చేస్తాడని వార్తలొస్తున్నాయి. దానికి తోడు రీసెంట్ గా బన్నీని కలవడం కూడా ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. దీంతో బన్నీ, ఎన్టీఆర్ లు డైరక్టర్లన్ని మార్చుకున్నారేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలంటే త్వరలోనే వీరి కాంబినేషన్ లో మూవీ పై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.













