కేజీఎఫ్ ఛాప్టర్ 2 వెర్సెస్ బీస్ట్ : విజయ్, యష్ లలో విజయం ఎవరిదో?
కరోనా వేవ్స్ కారణంగా అన్నీ సినిమా ఇండస్ట్రీలు అగాధంలో కూరుకుపోయాయి. దాంతో ఆయా చిత్ర నిర్మాతలు ఆచి తూచి సోలో డేట్ చూసుకొని తమ సినిమాను బాక్సాఫీస్ వద్దకు తీసుకువస్తున్నారు. ఒకప్పుడు పోటా పోటీగా సినిమాలు రిలీజైతేనే అభిమానుల్లో కూడా రెట్టింపు ఉత్సాహం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. రెండు మీడియం బడ్జెట్ సినిమాలను ఒకే తేదీన గానీ, ఒకరోజు అటు ఇటు గానీ రిలీజ్ చేయాలంటే మ్యూచవల్ అండర్‌స్టాండింగ్‌తో ఫిక్స్ అవుతున్నారు. అయితే ఏప్రిల్‌లో బాక్సాఫీస్ బరిలోకి రెండు భారీ చిత్రాలు పోటీ పడుతున్నాయి. యష్ సినిమా కె.జి.యఫ్ 2 సినిమాకు పోటీగా దళపతి విజయ్ బీస్ట్‌ను విడులద చేస్తున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. బాక్సాఫీస్ వద్ద రెండు భారీ చిత్రాలు పోటీ దాదాపు రెండేళ్ళు దాటిపోయింది. రాజమౌళి కూడా తన దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాను రిలీజ్ చేసేందుకు కనీసం రెండు వారాలు మరో భారీ చిత్రం పోటీ లేకుండా చూసుకున్నారు.
అయితే, ఇప్పుడు ఇత్తరు స్టార్ హీరోలు ఒక్క రోజు తేడాతో తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఏటో చూసుకునేందుకు బరిలో దిగబోతున్నారు. తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం బీస్ట్. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే ఇందులో విజయ్ సరసన హీరోయిన్గా నటించింది. అగ్ర నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 13న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ చిత్రం కేజీఎఫ్ ఛాప్టర్ 1 సీక్వెల్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే పార్ట్ 1తో సౌత్ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న యష్ – ప్రశాంత్ నీల్ కాంబోలో పార్ట్ వస్తుండటంతో భారీగా అంచనాలున్నాయి. గత ఏడాది వచ్చిన కేజీఎఫ్ సినిమా టీజర్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. గత చిత్రం మాస్టర్ కూడా ఘన విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల మధ్య సౌత్‌లో భారీ పోటీ ఉండబోతోంది. చూడాలి మరి వీరిలో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకొని బాక్సాఫీస్ కింగ్‌గా విజయం సాదించేదెవరో చూడాలి.













