సంక్రాంతి కి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 విడుదలకు సిద్ధం!
కె.జి.ఎఫ్ చాప్టర్ 1 సినిమా దేశవ్యాప్తంగా ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో తెలిసిందే! మాతృక కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ తెలుగు, తమిళం, హిందీ వర్షన్స్ లో సంచలన విజయం సాధించింది. చాప్టర్ 1 సక్సెస్ అవడంతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను మొదటి పార్ట్ కంటే గ్రాండ్ గా ప్లాన్ చేశాడు డైరక్టర్ ప్రశాంత్ నీల్. ఈసారి బడ్జెట్ కూడా 200 కోట్లకు పైగా పెడుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కూడా భాగమవుతున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 అంతకు మించి అనేలా రాబోతుంది. నవంబర్ ఎండింగ్ కల్లా ఈ సినిమా పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో యశ్ మరోసారి తన సత్తా చాటుతాడని తెలుస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆపేసిన తరువాత మళ్ళీ నెల రోజుల క్రితం పునఃప్రారంభించారు. అన్ని పూర్తి చేసుకుని ఈ సినిమాను 2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
2021 సంక్రాంతికి కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగులో ఆల్రెడీ సంక్రాంతికి స్టార్స్ సినిమాల రిలీజ్ కు క్యూ కట్టాయి. అఖిల్ బ్యాచ్ లర్ సినిమాతో పాటుగా నితిన్ రంగ్ దే కూడా 2021 పొంగల్ రేసులో ఉంటుందని తెలుస్తుంది. 2021 సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ బోయపాటి సినిమా కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సంక్రాంతి రేసులో ఉంటే మాత్రం మిగతా సినిమాలకు గట్టి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు. మరి కె.జి.ఎఫ్ 2 కి పోటీగా ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో ఏవి పోస్టుపోన్ చేస్తారో చూడాలి.













