మొదలైన కేజీఎఫ్-2
కన్నడలో ఘన విజయం సాధించిన కేజీఎఫ్.. తెలుగులోనూ మంచి వసూళ్లని దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2కి శ్రీకారం చుట్టారు. యశ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. శ్రీనిధి నాయిక. ప్రశాంత్ నీల్ దర్శకుడు. బెంగళూరులో చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. కేజీఎఫ్ చాప్టర్ 1లో కనిపించిన వాళ్లంతా చాప్టర్ 2లోనూ ఉంటారు. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించనున్నారు. అక్టోబరుకు చిత్రీకరణ పూర్తవుతుంది. 2020 వేసవిలో కేజీఎఫ్ ఛాప్టర్ 2ని విడుదల చేస్తామంది చిత్రబృందం.













