‘కె.జి.యఫ్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్..
యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ KGF 2. భారీ అంచనాల నడుమ విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న KGF 2 తొలిరోజు ఎంత వసూళ్లను సాధించిందో చూద్దాం.. ఆసక్తికరమైన విషయమేమంటే..రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ KGF 2. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల తర్వాత బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకుంది. ఇక ప్రీ బుకింగ్స్ కూడా అదే రేంజ్లో అయ్యాయి. దీంతో తొలి రోజున KGF 2 కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందోనని ట్రేడ్ వర్గాలే కాదు.. సామాన్య ప్రేక్షకులు సైతం ఎదురు చూడసాగారు.
ఒకానొక దశలో KGF 2 మూవీ రీసెంట్గా రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను దాటేస్తుందా? అని కూడాఅ అందరూ భావించారు. దీంతో అందరూ KGF 2 తొలిరోజు బాక్సాఫీస్ లెక్కలు కోసం ఎదురుచూడసాగారు. భారీ అంచనాల నడుమ విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న KGF 2 తొలిరోజు ఎంత వసూళ్లను సాధించిందో చూద్దాం.. ఆసక్తికరమైన విషయమేమంటే ఇది వరకు ప్రస్తావించినట్లు ఒకానొక దశలో KGF 2 వర్సెస్ RRR అనే క్యాలిక్యులేషన్స్ మొదలయ్యాయి. కానీ.. తొలి రోజున RRR కలెక్షన్స్‌ను KGF chapter 2 క్రాస్ చేయలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఫస్ట్ డే KGF 2 సినిమాకు వచ్చిన వసూళ్లు ఎంతంటూ రూ.150 కోట్ల గ్రాస్. నెట్ వసూళ్ల ప్రకారం చూస్తే ఇది దాదాపు రూ.130 కోట్లు. మరి ఆర్ఆర్ఆర్ సినిమా తొలిరోజున రూ.223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుంది. ఆ లెక్కలో రూ.73 కోట్ల రూపాయలు వసూళ్లు ట్రిపుల్ ఆర్కి ఎక్కువగా వచ్చాయి.ఫస్ట్ డే వసూళ్ల రికార్డులో RRR సినిమాను KGF 2 క్రాస్ చేయలేదు. మరి కె.జి.యఫ్ 2 ఏరియా వైజ్ ఏ మేరకు వసూళ్లను సాధించిందో చూద్దాం..(గ్రాస్ వసూళ్లు) బాలీవుడ్లో తొలిరోజున రూ.63 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. (ఇక నెట్ వసూళ్ల పరంగా రూ.54 కోట్లు వచ్చాయి). కర్నాటకలో రూ.35 కోట్లు ఆంధ్రప్రదేవ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.33 కోట్లు తమిళనాడులో రూ.12 కోట్లు కేరళలో రూ.7.50 కోట్లు మొత్తంగా చూస్తే రూ.150 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.













