మరోసారి ఘనవిజయం సాధించిన “కెజిఎఫ్”
యష్ హీరోగా తెరకెక్కిన `కెజిఎఫ్` దేశవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్‌గా కెజిఎఫ్ చాప్టర్ 2 రూపొందుతోంది. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచి పోయింది. త్వరలోనే బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కెజిఎఫ్ సాధించిన ఘనవిజయం వల్ల ఈ సినిమా సీక్వెల్‌కి భారీ క్రేజ్ ఏర్పడింది. బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న సినిమా ఇదే కావడం విశేషం.
ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతున్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందో. దేశవ్యాప్తంగా ఉన్న లాక్డౌన్ కారణంగా రెండు నెలలపాటు ప్రజలంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ సయమంలో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న సినిమాలకు మంచి గిరాకీ ఏర్పడింది. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న కెజీఎఫ్ లాక్డౌన్ సమయంలో ఎక్కువ ట్రెండ్ అయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఒక భాష అని కాకుండా అన్ని భాషల్లోనూ ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించి మరోసారి ఘనవిజయాన్ని అందించారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. సినిమా రిలీజ్ అయినప్పడు ఆడియన్స్ అందించిన విజయానికి ఎంతో సంతోషించామని, ఇప్పుడు లాక్డౌన్ సమయంలోనూ తమ సినిమాకు మరోసారి విజయం అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్తున్నామని అన్నారు.
కెజిఎఫ్‌కి వచ్చిన క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని కెజిఎఫ్ చాప్టర్ 2ని మరింత భారీగా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మిస్తున్నామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. రెండో పార్ట్‌లో యష్ క్యారెక్టర్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని, పక్కా మాస్ క్యారెక్టర్‌తో మరో సారి థియేటర్స్‌లో హల్చల్ చేస్తాడని దర్శకుడు ప్రశాంత్ నీల్ అంటున్నాడు.













