శతమానం భవతి సీక్వెల్ కు ఎన్నో మార్పులు
2017 సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో శతమానం భవతి కూడా ఒకటి. చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నెం.150, బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాల పోటీని తట్టుకుని మరీ చిన్న సినిమాగా పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి ఘన విజయం సాధించింది శతమానం భవతి. అంతేకాదు ఈ సినిమా నేషనల్ అవార్డ్ ని కూడా దక్కించుకుంది.
అందుకే శతమానం భవతిని దిల్ రాజు చాలా స్పెషల్ గా చెప్పుకుంటాడు. టైమ్ వచ్చినప్పుడల్లా తన వ్యక్తిగత జీవితాన్ని తెరమీద చూసుకున్న ఫీలింగ్ ఇస్తుందని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా శతమానం భవతి నెక్ట్స్ పేజీ టైటిల్ తో మూవీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి డైరెక్టర్ సతీష్ వేగేశ్న కాదు.
దిల్ రాజు బ్యానర్ లో పదేళ్లుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న హరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఈ విషయాన్ని లవ్ మి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా దిల్ రాజే అనౌన్స్ చేశాడు. హీరో ఎవరనేది చెప్పలేదు కానీ శర్వానంద్ ప్లేస్ లో ఈ సారి ఆశిష్ నటించే అవకాశాలున్నట్లు చెప్తున్నారు. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ దిల్ రాజు ఆల్రెడీ డిసైడయ్యాడని టాక్. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్సుంది. స్వయంగా దిల్ రాజు అందించిన కథను బలమైన భావోద్వేగాలతో హరి డెవలప్ చేశాడంటున్నారు.













