వైఎస్ జగన్ కు కేతిరెడ్డి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చారిత్మాక విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు సినీ నిర్మాత దర్శకుడు కేతిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో తమ దృష్టికి తీసుకొచ్చిన తమిళనాడు తెలుగు విద్యార్థుల సమస్యలను.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో సమాలోచనలు జరిపి వారి సమస్యలను తీర్చాలని.. ఒక అధికారుల బృందాన్ని తమిళనాడుకు పంపి వెంటనే తమిళనాడులోని తెలుగువారి సమస్యలను తెలుసుకొని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని, అదే విధంగా తెలుగు సినిమా 50 శాతం ఆంధ్రాలో షూటింగ్ ఖచ్చితంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్లో స్థిరనివాసం ఏర్పరుచు కొన్ని సినీ నటులు, సాంకేతిక వర్గాల వారికి అన్ని రకాల వసతులు కల్పించాలని కేతిరెడ్డి కోరారు.













