Kethika Sharma: కేతిక టైమ్ అస్సలు బాలేదుగా!
పూరీ ఆకాష్(Puri Akash) హీరోగా నటించిన రొమాంటిక్(Romantic) మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కేతిక శర్మ(Karthika Sharma) ఆ సినిమా డిజాస్టర్ అవడంతో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కేతిక ఇండస్ట్రీలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా తను చేసిన ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ కాలేదు. ఆఖరికి రీసెంట్ గా అమ్మడు రాబిన్హుడ్(Robinhood) లో చేసిన స్పెషల్ సాంగ్ కూడా కేతికకు ఏ మాత్రం హెల్ప్ అవడం లేదు.
ఇదంతా చూసి కేతిక ఇండస్ట్రీకి రాంగ్ టైమ్ లో ఎంటరైందా అని అభిప్రాయపడుతున్నారు. కేతిక ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఫ్లాపులవడంతో అమ్మడికి హీరోయిన్ గా ఛాన్సులు తగ్గాయి. దీంతో రాబిన్హుడ్ లో వచ్చిన స్పెషల్ సాంగ్ ను చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది తప్పించి ఆ సాంగ్ చేయడం వల్ల కేతికకు పెద్దగా ఒరిగిందేమీ లేదనిపిస్తోంది.
అయితే ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్టు సింగిల్(Single). శ్రీ విష్ణు(Sree vishnu) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కేతిక హీరోయిన్ గా నటిస్తోంది. వరుస హిట్లలో ఉన్న శ్రీ విష్ణు తో అయిన కేతిక ఈసారి హిట్ అందుకుంటుందేమో చూడాలి. ఎందుకంటే సింగిల్ కూడా అమ్మడికి సక్సెస్ ను ఇవ్వకపోతే భవిష్యత్తులో తనకు ఛాన్సులు రావడం చాలా కష్టం. అందుకే కేతిక తన ఆశలన్నింటినీ ప్రస్తుతానికి సింగిల్ పైనే పెట్టుకుంది.













