Kenisha: ఆ వార్తలపై స్పందించిన కెనీషా

తమిళ నటుడు జయం రవి(Jayam Ravi) పేరు గత కొన్నాళ్లుగా నెట్టింట తెగ వినిపిస్తోంది. తన భార్యకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఆమెకు విడాకులిస్తున్నట్టు ప్రకటించి వార్తల్లో నిలిచిన జయం రవి, ఆమె నుంచి విడిపోయి సింగర్ కెనీషా(Kenisha)తో డేటింగ్ లో ఉన్నాడని ఇప్పటికే ఎన్నో పుకార్లు రాగా, ఇప్పుడు తాజాగా కెనీషాకు సంబంధించిన మరో వార్త నెట్టింట ప్రచారమవుతుంది.
కెనీషా ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో రూమర్లు వస్తుండగా, వాటిపై తాజాగా ఆమె స్పందించింది. తానేంద దేవదూతను కాదనీ, అలా అని దెయ్యాన్ని కూడా కాదని, నెట్టింట తనపై ఇలాంటివి ఒకదాని తర్వాత మరోటి పుట్టుకొస్తూనే ఉంటాయని, ఓ గాసిప్ ఇంకో గాసిప్ కు దారి తీస్తుందని, వీటన్నింటికీ కాలమే పరిష్కారం చెప్తుందని చెప్పింది.
తాను కూడా ఈ విషయంలో సమధానం చెప్పగలనని, కానీ ఈ మ్యాటర్ లో తాను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్టు కెనీషా చెప్పింది. ఇటీవల ఓ పాట షూటింగ్ సమయంలో కెనీషా ఫోటోను ఉద్దేశిస్తూ కొందరు ఈ రూమర్లు సృష్టించగా ఆ వార్తలు నెట్టింట విపరీతంగా ప్రచారమయ్యాయి. గత కొన్నాళ్లుగా జయం రవితో డేటింగ్ లో ఉన్న కెనీషా ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే వార్తలు ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.