ఈసారైనా కీర్తిని విజయం వరిస్తుందా?
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బజ్ తెప్పించడం చాలా కష్టం. ఏదో ఒకటి రెండు సినిమాలు ఆడినంత మాత్రాన ఆడియన్స్ అన్ని అదే రీతిలో ఉన్న సినిమాలను చూస్తారనే గ్యారెంటీ లేదు. ఒకప్పుడు ఈ తరహా సినిమాలు చేసి విజయశాంతి(Vijayasanthi) మంచి క్రేజ్ సంపాదించుకుంది కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. హీరోలదే డామినేషన్ అయింది.
వారి పేర్ల మీదే బిజినెస్ జరుగుతుంది. కానీ కీర్తి సురేష్ మాత్రం ఈ విషయంలో ఎంతో అదృష్టవంతురాలని చెప్పాలి. కీర్తి(Keerthy)కి ఎన్ని ఫ్లాపులొచ్చినా తననే లీడ్ రోల్ లో పెట్టి సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. మహానటి(Maha Nati)తో మొదలైన ఈ వైనం కరోనా టైమ్ లో పెంగ్విన్(Penguine) తీసేలా చేసింది. హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమ ఓటీటీలో రిలీజైనప్పటికీ మంచి రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది.
తర్వాత మిస్ ఇండియా(Miss India) అనే పెద్ద సినిమా వచ్చింది కానీ అదీ ఫ్లాపైంది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని గుడ్ లక్ సఖి(good Luck Sakhi) అనే సినిమా తీసి మరో పరాజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఓటీటీ మూవీగా చిన్ని(chinni) తీసింది కానీ ఫలితం లేకపోయింది. రీసెంట్ గా రఘుతాత(Raghu Thatha) వచ్చింది దానికి మరీ దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు కీర్తి రివాల్వర్ రీటా(Revolver reeta)గా మరో ట్రయల్ వేయడానికి రెడీ అయింది. రీసెంట్ గా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే ఏదో కొత్తగా ట్రై చేశారనిపిస్తోంది. ఇప్పుడైనా కీర్తిని విజయం వరిస్తుందో లేదో చూడాలి మరి.













