కీర్తి సురేష్ ఆ పని చేసింది
రానా సరసన నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? కానీ కీర్తి సురేష్ ఆ పని చేసింది. డేట్స్ వంక పెట్టి రానాతో నటించే అవకాశాన్ని వద్దనుకుంది. రానా బాలీవుడ్లోనూ పేరున్న స్టార్ కావడంతో ఇప్పుడిది నేషనల్ న్యూస్ అయిపోయింది. ఇది సహజంగానే రానాకి తలనొప్పిగా మారింది. చేయకపోతే పోయింది.. ఆ విషయం బయటకు లీక్ అవ్వడం పట్ల రానా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మహానటితో మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఈ మధ్య మొహమాటానికిపోయి మన్మథుడు-2 స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చింది. దాంతో ఇకపై మొహమాటాలకు పోకూడదనుకుందో ఏమో.. తనకు కథ నచ్చకపోవడంతో హీరో ఎవరని చూడకుండా నో చెప్పేసింది.













