రజనీకాంత్ సరసన కిర్తీ సురేష్ ?
దర్బార్ చిత్రీకరణ పూర్తి కాగానే, రజనీకాంత్ కొత్త చిత్రంపై దృష్టిపెట్టారు. శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతోంది. అందులో కథానాయికగా కీర్తిసురేష్ ఎంపికైనట్టు సమాచారం. దర్బార్ లోనే రజనీ-కిర్తీ కలిసి నటిస్తుందని తమిళ సినీ వర్గాలు అనుకున్నాయి. కానీ అందులో నయనతారకి అవకాశం దక్కింది. ఈసారి మాత్రం కీర్తి ఎంపిక ఖాయమేనిన తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. జ్యోతిక కూడా నటించబోతోందని ప్రచారం సాగుతోంది. ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తారన్నది త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.













