అలివేలుమంగగా కీర్తి సురేష్ ?
దర్శకుడు తేజ ఇటీవలే రెండు సినిమాల్ని ప్రకటించారు. అందులో ఒకటి అలివేలుమంగ వేంకటరమణ. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తారని సమాచారం. టైటిల్‌ని బట్టి కథానాయకుడు వేంకటరమణగా, కథానాయిక అలివేలుమంగగా కనిపిస్తారని అర్థమవుతోంది. ప్రస్తుతం మంగ పాత్ర ఎంపిక కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఇదివరకే ఓ అగ్ర తార పేరు వినిపించింది. తాజాగా ఆ పాత్ర కోసం కీర్తి సురేష్‌ని సంప్రదించినట్టు సమచారం. త్వరలో మిస్ ఇండియా చిత్రంతో రాబోతున్న ఆమె తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలు చేస్తోంది. ఆమె మంగగా కనిపిస్తుందో లేదా తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.













