మిస్ ఇండియా గా మహానటి
మహానటితో మెప్పించిన కీర్తి సురేశ్ మిస్ ఇండియా కాబోతుందా? అంటే అవుననే అంటున్నారు. ఆ కిరీటం కోసం కీర్తి తన కాయాన్ని కూడా తగ్గించుకుంది. దాని కోసం తీవ్రంగా శ్రమించింది. సుమారుగా 3 నెలల పాటు తన బరువు తగ్గించుకోవడం కోసం శిక్షణ తీసుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. 180 ఫేమ్ మహేశ్ కోనేరు నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తుంది. ఆ చిత్రంలో ఈమె కీలక పాత్ర పోషించనుంది. నరేంద్రనాథ్ అనే వ్యక్తి ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇది మహిళా ప్రధాన చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా కథ ప్రకారం ఈ చిత్రానికి మిస్ ఇండియా అనే టైటిలే సరిపోతుందని చిత్రబృందం కూడా భావిస్తోంది. ఇది కాకుండా వేరే టైటిల్ పెడితే ఎలా ఉంటుందన్న కోణంలోనూ మేకర్స్ ఆలోచిస్తున్నారు. అంతిమంగా టైటిల్ ఏమిటన్నది తర్వలో ప్రకటించనున్నారు.













