మహేష్ ఆ హీరోయిన్ ని ఎందుకు సెలెక్ట్ చేసినట్లు?
మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆన్ లొకేషన్ లో డైరక్టర్ ఎంత సీరియస్ గా పని చేస్తున్నారో దానికి సంబంధించిన ఫోటోలు కూడా లీకయ్యాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ లుక్ కి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికే రివీలయ్యాయి.
అసలు విషయానికొస్తే.. ఈ సినిమాకు సైన్ చేసే టైమ్ కి కీర్తి రేంజ్ వేరేలా ఉంది. ఇప్పుడు కీర్తి సిట్యుయేషన్ అధ్వాన్నంగా పడిపోయింది. దీంతో కీర్తి స్టేటస్ సర్కార్ వారి పాటకు టెన్షన్ అయ్యేలా ఉంది. అసలు సర్కారు వారి పాటకు కీర్తి ఏ యాంగిల్ లో ప్లస్ అవుతుందని కీర్తిని సెలెక్ట్ చేసుకున్నారో క్లారిటీ రావట్లేదు. మహేష్ ఎప్పుడూ హీరోయిన్ల విషయంలో చాలా కేర్ తీసుకుంటుంటాడు. తన ప్రతి సినిమాకి హ్యాపెనింగ్ హీరోయిన్లతోనే చేస్తుంటారు. అలాంటిది ఈ భామకు మహేష్ ఎలా ఓకే చెప్పాడనేది అర్థం కావట్లేదు. మరి వీటన్నింటినీ కాదని కీర్తి తన నటనతో ఈ సినిమాతో ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.













