Vijay Devarakonda: రౌడీ హీరో సరసన నటించనున్న మహానటి

ఎన్నో అంచనాలు పెట్టుకుని రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) చేసిన ఖుషి(Kushi), ఫ్యామిలీ స్టార్(family star), కింగ్‌డమ్(Kingdom) సినిమాలు అతన్ని తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఎంతో కసితో ఉన్నాడు విజయ్. ప్రస్తుతం విజయ్(Vijay) చేతిలో రెండు సినిమాలుండగా, అందులో మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మాణంలో ట్యాక్సీవాలా(Taxiwala) డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్(Rahul Sankrityan) తో చేస్తున్నాడు.
రెండో సినిమా దిల్ రాజు(Dil raju) బ్యానర్ లో రాజా వారు రాణి గారు(raja varu rani garu), అశోకవనంలో అర్జున కళ్యాణం(Ashoka vanam lo arjuna kalyanam) ఫేమ్ రవికిరణ్ కోలా(ravi kiran kola) దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకు మేకర్స్ రౌడీ జనార్థన(rowdy janardhana) అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా, ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట వినిపిస్తుంది. అక్టోబర్ 11న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలుకానుందని తెలుస్తోంది.
మొదటి సినిమాలను క్లాస్ గా తీసిన రవికిరణ్, ఇప్పుడు విజయ్ తో చేయబోయే సినిమాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాడని సమాచారం. అందులో భాగంగానే మొదటి షెడ్యూల్ ను అక్టోబర్ 16 నుంచి ముంబైలో మొదలుపెట్టనున్నారట. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మహానటి కీర్తి సురేష్(Keerthy suresh) నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.