జూన్ 19న ఓటీటీలో కీర్తి సురేష్ ‘పెంగ్విన్’
లాక్డౌన్ కారణంగా మూడు నెలలుగా థియేటర్స్ మూత పడడంతో రిలీజ్ వరకూ వచ్చి ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాతే రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. కొంతమంది మాత్రం తమ సినిమాలను ఓటీటీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ లిస్ట్‌లో తాజాగా కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` సినిమా చేరింది. తాము చేసిన సినిమా ప్రేక్షకుల వరకు వెళ్ళడమే మాకు ముఖ్యమని, అందుకోసం థియేటర్స ఓపెన్ చేసే వరకు ఆగే ఉద్దేశం తమకు లేదని `పెంగ్విన్` దర్శకనిర్మాతలు చెబుతున్నారు. అందుకే జూన్ 19న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. దీనిపై హీరోయిన్ కీర్తి సురేష్ స్పందిస్తూ `నా అభిమానులు, ప్రేక్షకులు `పెంగ్విన్` చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చెయ్యండి` అని కోరుతోంది. ఈ సినిమా టీజర్‌ను జూన్ 8న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసిన పెంగ్విన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. అమెజాన్ ప్రైమ్. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకాలపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈశ్వర్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.













